News

క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం

క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం

జూ।।కళాశాలల క్రీడల ముగింపు వేడుక

ఓవరాల్‌ ఛాంపియన్‌ ఎస్పీడబ్ల్యూ

మంత్రి సతీమణి రేణుకారెడ్డి వెల్లడి

పలమనేరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి సతీమణి రేణుకారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బుధవారం జిల్లా జూనియర్‌ కళాశాలల క్రీడాపోటీల బహుమతి ప్రదానోత్సవ సభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాతరోజుల్లో కంటే ఇప్పుడు క్రీడలకు మంచి ప్రోత్సాహం లభిస్తోందన్నారు. క్రీడలు జీవన విధానంలో మనకు మంచి నడవడిని ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సర్వసాధారణమని, ఓటమిని చూసి కుంగిపోరాదన్నారు. ఆటల పోటీల్లో బాలికలు కూడా ఎక్కువ మంది పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. పోటీలను తమ కళాశాలలో మొట్టమొదటిసారి నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్‌ సయ్యద్‌మౌల తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, అధ్యాపకులు తమకు ఎంతో సహకరించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ చాన్‌బాషా, తెదేపా నాయకులు హేమంత్‌కుమార్‌రెడ్డి, జగదీష్‌, కుట్టి, ఖాజా, ఎలిజర్‌లు పాల్గొన్నారు.

సత్తా చాటిన ఎస్పీడబ్ల్యూ
ఈ పోటీల్లో బాలికల విభాగంలో తిరుపతి ఎస్పీడబ్ల్యూ జూనియర్‌ కళాశాల విద్యార్థినులు ఓవరాల్‌ ఛాంపియన్‌గా బహుమతిని గెలుచుకున్నారు. వ్యక్తిగత ఛాంపియన్‌లుగా బాలికలలో ఎస్పీడబ్ల్యూ కళాశాలకు చెందిన లక్షీప్రసన్న, బాలురలో చంద్రగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన గణేష్‌లు నిలిచారు. ఛాంపియన్‌షిప్‌ కప్‌ను హైదరాబాదు ఎంఎస్‌ఆర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ నిర్వాహకురాలు రెడ్డిశ్యామల ప్రదానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *