News

All are crucial in the new year

నూతన సంవత్సరంలో.. అందరూ బాగుండాలి

నూతన సంవత్సరంలో.. అందరూ బాగుండాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి దుర్గారావు

చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే(All are crucial in the new year): రానున్న నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి దుర్గారావు ఆకాంక్షించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి అధ్యక్షతన శుక్రవారం చిత్తూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్‌ భవనంలో 2016కు వీడ్కోలు పలుకుతూ.. 2017ను స్వాగతిస్తూ సమావేశం జరిగింది. తొలుత నూతన సంవత్సరం కేక్‌ను ప్రధాన న్యాయమూర్తి కోసి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి దుర్గారావు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరూ సుఖసంతోషాలతో గడపాలన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ న్యాయవాద వృత్తికి గొప్ప విశిష్టత ఉందన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి మధుసూదనరావు, న్యాయమూర్తులు జియాఉద్దీన్‌, కృష్ణన్‌కుట్టి, భరద్వాజ్‌, బార్‌ అసోసియేషన్‌ నాయకులు గల్లా రాజారాం, శ్రీరాములునాయుడు, సుధాకర్‌గుప్తా, రవీంద్రన్‌, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *