News

ప్రతి పేదవాడికీ ఇల్లు ప్రభుత్వ లక్ష్యం

ప్రతి పేదవాడికీ ఇల్లు ప్రభుత్వ లక్ష్యం

హిందూపురం: ప్రతి పేదవాడికీ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం పట్టణ శివారులోని ఎన్టీఆర్‌ నగర్‌లో పీఎంఏవై కింద నిర్మించనున్న ఇళ్ల నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని హిందూపురం పట్టణానికి 11,000 ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ఈ ఇళ్లను జీ ప్లస్‌ 3 పద్ధతిలో నిర్మించేందుకు బహుళజాతి కంపెనీకి పనులు అప్పగించినట్లు చెప్పారు. రూ. 160.51 కోట్లతో మొదటి విడతగా 2750 ఇళ్లు నిర్మించి పేదలకు అందజేస్తామన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా మరో 6000 ఇళ్ల నిర్మాణపనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు సహకారంతోనే హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది నిధులు తీసుకువచ్చి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ నిమ్మల కిష్టప్ప, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆర్‌.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *