News

మన నగరం… మన చేతుల్లో!

మన నగరం… మన చేతుల్లో!

స్వచ్ఛందంగా కదలితేనే..అందంఈ

నెలాఖరులో స్వచ్ఛ సర్వేక్షణ్‌ మలి సర్వే

పౌర స్పృహ లోపిస్తే.. ర్యాంకు గల్లంతే!

తిరుపతి నగర జనాభా నాలుగు లక్షలు. కుటుంబాల సంఖ్య లక్ష. నగరంలో గృహాలు, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, పాఠశాలల నుంచి నిత్యం ఉత్పత్తి అయ్యే చెత్త 200 మెట్రిక్‌ టన్నులు. చెత్త సేకరణ నిమిత్తం కార్పొరేషన్‌లోని 50 వార్డులను 10 డివిజన్‌లుగా విభజించారు. 160 మంది తిరుపతిలోని రాజన్న పార్కు సమీపంలో మంచాల వీధి పేరుతో ఓ కాలనీ ఉంది. ఇక్కడి అపరిశుభ్రతపై తరచూ కార్పొరేషన్‌కు ఫిర్యాదులు వస్తున్నాయి. చెత్త కుప్పలు తీయడం లేదని, రోడ్డుపై చెత్త వేస్తున్నారన్నది ఆరోపణ. నగరపాలక సంస్థ సిబ్బంది వారం రోజుల పాటు ఈ కాలనీపై ప్రత్యేక దృష్టి సారించారు. ఫొటోలు తీశారు.

వీడియోలు చిత్రించారు. తేలిందేమిటంటే.. పారిశుద్ధ్య కార్మికులు నిత్యం వీధులను, కాలువలను శుభ్రం చేస్తున్నారు. ఆ వీధిలోని 60 శాతం కుటుంబాలు ఇంటి వద్దకు వచ్చే కార్మికునికి చెత్త ఇవ్వడం లేదు. తర్వాత కాలువల్లో, రోడ్లపై, చెత్తకుండీ వెలుపల పడేస్తున్నారు. పరిశుభ్రతపై నిత్యం ఫిర్యాదులు చేసే స్థానికులే.. చెత్తను రోడ్డుపై పడేస్తున్న వైనం వీడియోల్లో నిక్షిప్తమైంది. ‘ప్రభుత్వం ఎంత చేసినా.. పౌర స్పృహ లోపిస్తే స్వచ్ఛభారత్‌ సాకారం కాద’న్న సంగతి అర్థమైంది. ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌-2018’ పోటీలకు సిద్ధమవుతున్న తిరుపతి నగరపాలిక.. ఇలాంటి జాఢ్యాన్ని వదిలించుకోవాల్సిన అవసరం కన్పిస్తోంది.

గతేడాది సర్వేలో జాతీయ స్థాయిలో విశాఖపట్నం మూడో స్థానంలో నిలవగా, తిరుపతి 9వ స్థానం సాధించింది. విభాగాల వారీగా ఈ రెండు నగరాలు సాధించిన మార్కులను పోలిస్తే.. నగరపాలిక కార్మికులు, 649 మంది ఒప్పంద ఉద్యోగులు ఇంటింటి చెత్త సేకరిస్తున్నారు. రహదారులు, వీధులను శుభ్రం చేస్తున్నారు. వీరిపై 10 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు, ఇద్దరు శానిటరీ సూపర్‌వైజర్‌లు పర్యవేక్షిస్తారు.

నగరంలో వెయ్యి కిలోల సామర్థ్యం గల 144 చెత్త కుండీలు, 500 కిలోల సామర్థ్యం గల 200 చెత్తకుండీలు (డంపర్‌ బిన్స్‌) ఉన్నాయి. ఒకేసారి 6 టన్నుల చెత్తను తరలించగల 11 డంపర్‌ ప్లేసర్లు, 12 టన్నుల చెత్తను తరలించగల 4 కాంపాక్టర్‌లు, 16 ట్రాక్టర్లు, 4 టిప్పర్‌లు ఉన్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ నిబంధనలకు అనుగునంగా నగరంలో ప్రతి 500 మీటర్లకో మరుగుదొడ్డి అందుబాటులో ఉండాలి. నిబంధనలను అనుసరిస్తూ ప్రస్తుతం నగరంలో ప్రజా, ఈ-మరుగుదొడ్లను కలిపి 38 మరుగుదొడ్లు అందుబాటులోకి తెచ్చింది. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని ప్రజా సమూహాల ఉన్న ప్రాంతాలలో 11 సామాజిక మరుగుదొడ్లు నిర్మించారు. బహిరంగ మూత్ర విసర్జనను నియంత్రించేందుకు నగరంలో 31 ప్రాంతాల్లో ఉచిత మూత్ర విసర్జన కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *