News

రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించిన కడప జట్టు

రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించిన కడప జట్టు

కడప క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి మొదటి జూనియర్‌ టెన్నిస్‌ క్రికెట్‌ పోటీల్లో కడప జట్టు అత్యుత్తమ ప్రతిభ చూపి రెండోస్థానం సాధించిందని రాష్ట్ర టెన్నిస్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శి ప్రతాప్‌ తెలిపారు. డిసెంబరు 31, జనవరి 2 తేదీలలో నెల్లూరు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీల్లో 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్న టెన్నిస్‌ పోటీల్లో కడప జిల్లా జట్టు మంచి ప్రతిభ కనబరిచి రన్నరప్‌గా నిలిచిందన్నారు. అలాగే జిల్లా జట్టు తరఫున అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లా క్రీడాకారులు హరికృష్ణ, సాయికుమార్‌, సిద్దారెడ్డిలు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ జాతీయస్థాయి టెన్నిస్‌ పోటీలు ఈ నెల 12 నుంచి 15 వరకు తెలంగాణలో జరగనున్న జాతీయ టెన్నిస్‌ క్రికెట్‌ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను సంఘం సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా టెన్నిస్‌ సంఘం అధ్యక్షులు భానుప్రకాష్‌, ఉపాధ్యక్షులు ఎంఎస్‌.గాంధీ, కార్యదర్శి ప్రతాప్‌, సురేష్‌, రేవంత్‌, శ్రీను పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *