News

Vinayaku Vasthakunte

వినాయకుడు నందినెక్కి..విహరించె వీధులన్‌!

వినాయకుడు నందినెక్కి..విహరించె వీధులన్‌!

కాణిపాకంలో ప్రారంభమైన ప్రత్యేక ఉత్సవాలు

కాణిపాకం, న్యూస్‌టుడే: కాణిపాకం వినాయకుని ప్రత్యేక ఉత్సవాల్లో స్వామివారు మొదటి రోజున ఉభయదేవేరులతో కలసి స్వామివారు అధికార నంది వాహనంపై వూరేగుతూ భక్తులను కటాక్షించారు. వాహన సేవకు కాణిపాకానికి చెందిన వళ్ళువర్‌ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. సోమవారం ఉదయం స్వామివారి మూల విగ్రహానికి సంప్రదాయబద్ధంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మూల విరాట్టుకు ప్రత్యేక అలంకరణ చేసి, ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

రాత్రి స్వామివారికి అధికార నందివాహన సేవలో భక్తులు భారీగా పాల్గొన్నారు. సిద్ధిబుద్ధి సమేతుడైన వరసిద్ధి వినాయకస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాలంకృతులు గావించారు. మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను అధికార నందిపై అధిష్టింపచేసి కాణిపాకం పురవీధుల్లో ఘనంగా వూరేగించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో ఈవో పెనుమాక పూర్ణచంద్రరావు, ఏసీ హెచ్‌జీ వెంకటేష్‌, ఏఈవో కేశవరావు, సూపరింటెండెంట్‌ స్వాములు, ఆలయ ఇన్‌స్పెక¹్టర్లు రమేష్‌, మల్లికార్జున, ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు.