News

విశాఖ, బొబ్బిలి జట్ల విజయం

విశాఖ, బొబ్బిలి జట్ల విజయం

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్‌ పోటీలో విశాఖ, బొబ్బిలి జట్లు ఘన విజయాలు సాధించాయి. మొదటి పోటీలో విశాఖ జట్టు తిరుపతి జట్టుపై విజయభేరి మోగించింది. మరో పోటీలో కర్నూలు జట్టు గుంటూరు జట్టును ఓడించింది. అనంత క్రీడాగ్రామంలో జరిగిన మరో పోటీలో బొబ్బిలి జట్టు కర్నూలు జట్టుపై గెలిచింది. ఇంకో పోటీలో తిరుపతి జట్టు అనంతపురం జట్టుపై నెగ్గింది.

ఈ పోటీల ప్రారంభోత్సవానికి వికలాంగుల శాఖ ఏడీ రవీంద్రనాథ్‌బాబు, డీఎస్‌డీఓ బాషామొహిద్దీన్‌, అంధుల సంఘం నుంచి వెంకటనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంధులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని పేర్కొన్నారు. క్రికెట్‌లో మన రాష్ట్రం నుంచి ప్రపంచస్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. దుబాయ్‌లో జరగనున్న ప్రపంచకప్‌ పోటీల్లో మరోసారి విజయబావుటా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *