News

Excellence

వైభవోపేతం… శ్రీవారి గరుడోత్సవం

వైభవోపేతం… శ్రీవారి గరుడోత్సవం

కుండపోత వర్షంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి పున్నమి గరుడోత్సవాన్ని తితిదే బుధవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈనెల 23 నుంచి అక్టోబరు 1వరకు శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సాధారణంగా ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే పున్నమి గరుడసేవను తితిదే ప్రయోగాత్మకంగా పూర్తిస్థాయి బ్రహ్మోత్సవ వేడుకగా జరపడం ఆనవాయితీగా వస్తోంది. గరుడ వాహనానికి ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి ఉత్సవం కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. జోరున కురిసిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాదిగా పాల్గొన్నారు. వర్షంలో తడుస్తూనే తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, తిరుపతి ఎస్పీ అభిషేక్‌ మహంతి విధులు నిర్వర్తించారు. గరుడోత్సవంలో తిరుమల పెద్దజీయంగార్‌, చిన్నజీయంగార్‌, త్రిదండి చిన్నజీయర్‌స్వామి, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో కోదండ రామారావు, ఓఎస్డీ డాలరు శేషాద్రి, బొక్కసం బాధ్యులు గురురాజారావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *