News

technology innovations

సాంకేతికతతో అద్భుత ఆవిష్కరణలు

సాంకేతికతతో అద్భుత ఆవిష్కరణలు

మహిళా విశ్వవిద్యాలయం(తిరుపతి), న్యూస్‌టుడే: ప్రస్తుతం సైన్స్‌ రంగం చాలా అభివృద్ధి జరుగుతోందని, ఈ రంగానికి టెక్నాలజీని జోడిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ మినిస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సలహాదారు డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.రావ్‌ పేర్కొన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు సంబంధించి శుక్రవారం వర్సిటీ ఆడిటోరియంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.రావు మాట్లాడుతూ.. సైన్స్‌ పట్ల పిల్లలకు ఎంతో ఆసక్తి ఉంటుందన్నారు. చిన్నతనం నుంచే విద్యార్థులను ప్రోత్సహిస్తే సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో అద్భుత ఆవిష్కరణలు చేస్తారని చెప్పారు. లీవెన్‌హుక్‌ తన పరిశీలనలో మైక్రోస్కోపునకు అవసరమైన కీన్‌వెక్స్‌, కీన్‌కేవ్‌ లెన్స్‌ను కనుగొన్నారని చెప్పారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు కూడా నిశితమైన పరిశోధనలు చేయాలని తెలిపారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి.దుర్గాభవాని డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.రావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య వి.ఉమ, రిజిస్ట్రార్‌ ఆచార్య డి.ఎం.మమత, ఇతర ఆచార్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *