News

17న జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ జట్ల ఎంపిక

17న జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ జట్ల ఎంపిక

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే(Selection of district) : రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ఈనెల 17న ఎంపిక చేయనున్నట్లు జిల్లా టీటీ సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ అక్బర్‌సాహెబ్‌, కార్యదర్శి కేశవరెడ్డి తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు అనంతపురం క్లబ్‌లో నిర్వహించే ఎంపిక పోటీల్లో సత్తాచాటిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేస్తామన్నారు. సీనియర్స్‌ విభాగంలో పురుషులు, మహిళలు, జూనియర్‌ విభాగంలో బాలుర జట్టును ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు డీఎస్‌ఏ శిక్షకుడు ధనుంజయరెడ్డిని సంప్రదించాలని వారు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *