News

రూ.40 కోట్లతో వేంకన్న ఆలయాలు

రూ.40 కోట్లతో వేంకన్న ఆలయాలు తితిదే చీఫ్‌ ఇంజినీరు చంద్రశేఖరరెడ్డి‘ పీలేరు ఆర్‌ఎస్‌ మెయిన్‌, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూ.40 కోట్లతో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించనున్నట్లు తితిదే చీఫ్‌ ఇంజినీరు చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ.. కన్యాకుమారిలో రూ.16 కోట్లు, కురుక్షేత్రంలో రూ.12 కోట్లు, హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో రూ.12 కోట్లతో ఆలయ నిర్మాణాలు జరుగుతాయని చెప్పారు. ఆలయాల నిర్మాణానికి అనువైన స్థలాలు లభించిన తరవాత తితిదే పాలకమండలి సూచనల […]

Read More

నమో..నారసింహా..!

నమో..నార మృగరాజుపై భక్తజన బాంధవుడి విహారం నాగలాపురం, న్యూస్‌టుడే: నాగలాపురం వేదనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శుక్రవారం స్వామి నరసింహస్వామి అలంకరణలో మృగరాజుగా సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. భక్త జనుల కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉగ్రరూపంలో కొలువైన దేవదేవుడు వారిని అనుగ్రహిస్తూ దివ్య సంచారం చేశారు. ఏకాంతంగా తిరువీధుల్లో విహారాన్ని ముగించుకున్న వేదనారాయణుడు శ్రీదేవి, భూదేవీలతో కలసి ఆలయ మండపంలో పీఠంపై ఆసీనులవగా అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సంచారంతో […]

Read More

ఏడాదిలోపు తిరుచానూరు రైల్వేస్టేషన్‌

ఏడాదిలోపు తిరుచానూరు రైల్వేస్టేషన్‌ తిరుపతిలో రైల్వే జీఎం సుడిగాలి పర్యటన తిరుపతి(రైల్వే), న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే యాత్రికులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రైల్వేశాఖ చిత్తశుద్ధితో పనిచేస్తోందని దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.గురువారం ఆయన తిరుపతి రైల్వేస్టేషన్‌, సీఆర్‌ఎస్‌, తిరుచానూరు, రేణిగుంట రైల్వేస్టేషన్లను తనిఖీలు చేస్తూ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా తిరుపతి స్టేషన్‌లో పార్శిల్‌ కార్యాలయం పక్కన నిర్మాణం జరుగుతున్న నూతన భవనాన్ని, స్టేషన్‌కు దక్షిణం వైపు ఉన్న […]

Read More

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ విద్య ఎర్నెట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ నీనా పహుజ తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు అధికంగా ఉంటారని వారి కోసం ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యను అందిస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఎర్నెట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జనరల్‌ నీనా పహుజ పేర్కొన్నారు. తిరుపతిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా డిజిటల్‌ తరగతుల నిర్వహణ, […]

Read More

చిత్తూరులో తొలి తపాలా బ్యాంకు

చిత్తూరులో తొలి తపాలా బ్యాంకు దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే ప్రథమం చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే: దక్షిణాది రాష్ట్రాల్లోనే తొలిసారిగా జిల్లా కేంద్రమైన చిత్తూరులో తపాలా బ్యాంకు ఏర్పాటుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మరో నెల రోజుల్లో ఇక్కడ బ్యాంకింగ్‌ సేవలు ప్రారంభమవుతాయని చిత్తూరు తపాలా డివిజన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ విజయకుమార్‌ తెలిపారు. రూ.39.85 లక్షల వ్యయంతో నూతనంగా పునరుద్ధరించిన చిత్తూరు ప్రధాన తపాలా కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని […]

Read More

వసంతుడే.. చెలికాంతుడై!

వసంతుడే.. చెలికాంతుడై! ప్రకృతి ఒడిలో సేదతీరిన శ్రీనివాసుడు తిరుమల, న్యూస్‌టుడే: ప్రకృతి ఒడిలో శ్రీనివాసుడు సేదతీరాడు. మండు వేసవి తాపానికి తాళలేక చల్లని ఉద్యానవనాల్లోకి వచ్చి దేవేరులతో కలిసి విహరించాడు. శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఏటా చైత్ర మాసంలో వసంతోత్సవాల నిర్వహణ ఆనవాయితీ. ఈసారి ఉత్సవాల్లో రెండో రోజు సుగంధ ద్రవ్యాలతో వసంతాలాడుతున్న అనుభూతి కలిగేలా స్నపన తిరుమంజన సేవను అర్చకులు ఆదివారం నిర్వహించారు. ఆరాధనలు, అభిషేకాలు, నివేదనల అనంతరం పట్టువస్త్రాలను సమర్పించారు. సర్వాభరణాలు, పుష్పహారాలతో ఉత్సవర్లను అలంకరించారు. […]

Read More

రైల్వేస్టేషన్‌ అభివృద్ధి అందరి బాధ్యత

రైల్వేస్టేషన్‌ అభివృద్ధి అందరి బాధ్యత ఏడీఆర్‌ఎం సుబ్బరాయుడు తిరుపతి(రైల్వే), న్యూస్‌టుడే: తిరుపతి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుంతకల్‌ డివిజన్‌ అడిషినల్‌ మేనేజర్‌ కేవీ సుబ్బరాయుడు అన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను గురువారం స్టేషన్‌ అభివృద్ధి కమిటీ తరఫున ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ఆవరణంలోని విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, ప్లాట్‌ఫాంలు, గ్యారేజీ, యార్డును తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ప్రయాణికులకు నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలు అందించాలని ఆదేశించారు. […]

Read More

తిరుమలలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానోత్సవం

తిరుమలలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానోత్సవం చూడముచ్చటగా.. నవమి ఆస్థానోత్సవం రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. శ్రీశేషగిరిలో లోక రక్షాణార్థమై అర్చావతారంలో వెలసియున్న శ్రీవేంకటేశ్వరస్వామివారి సన్నిధానంంలో ఏటా చైత్రశుద్ధ నవమి శుభదినాన శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయస్వామి సమేత శ్రీరామచంద్రుడుకి మందిరంలోని రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజన క్రతువును శాస్త్రòక్తంగా నిర్వహించారు. […]

Read More

దాతలకు అండ దండ

దాతలకు అండ దండ రాష్ట్ర శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు తితిదే నుంచి అందుకున్న సందేశం చూసి ఆశ్చర్యపోయారు. ‘మీ కాటేజీ ద్వారా ఫిబ్రవరి మాసానికి దేవస్థానానికి రూ.23,500 ఆదాయం వచ్చింద’న్నది ఆ సందేశం సారాంశం. దీనిపై సభాపతి తితిదే ఈవో సాంబశివరావును ఆరా తీశారు. ‘మీ తండ్రిగారు కాటేజీ నిర్మాణానికి విరాళం ఇచ్చారు. ఆ కుటీరం ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు మీకు తెలియజేశామ’న్నది ఈవో సమాధానం.. విషయం తెలుసుకున్న కోడెల ఆనందపరవశులయ్యారు. మా పేరిట […]

Read More

పట్టాభిరాముడి కల్యాణం చూతమురారండి..

పట్టాభిరాముడి కల్యాణం చూతమురారండి.. నేటినుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు‘హితకర శ్రీవేంకటేశాయ నమో…వితత వావిలి పాటి వీర రామాయా’ అంటూ వాల్మీకి క్షేత్ర శ్రీరాముడిని కీర్తించిన తాళ్లపాక అన్నమయ్య.. శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించిన మాతృశ్రీ వెంగమాంబ.. చోళులు..విజయనగర రాజులు కొలిచిన శ్రీ పట్టాభిరాముడి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. హేవళంబి నామ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు అంగరవంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం తితిదే అన్ని ఏర్పాట్లు చేసింది. వాల్మీకిపురం, న్యూస్‌టుడే : వాల్మీకిక్షేత్ర […]

Read More