News

మన నగరం… మన చేతుల్లో!

మన నగరం… మన చేతుల్లో! స్వచ్ఛందంగా కదలితేనే..అందంఈ నెలాఖరులో స్వచ్ఛ సర్వేక్షణ్‌ మలి సర్వే పౌర స్పృహ లోపిస్తే.. ర్యాంకు గల్లంతే! తిరుపతి నగర జనాభా నాలుగు లక్షలు. కుటుంబాల సంఖ్య లక్ష. నగరంలో గృహాలు, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, పాఠశాలల నుంచి నిత్యం ఉత్పత్తి అయ్యే చెత్త 200 మెట్రిక్‌ టన్నులు. చెత్త సేకరణ నిమిత్తం కార్పొరేషన్‌లోని 50 వార్డులను 10 డివిజన్‌లుగా విభజించారు. 160 మంది తిరుపతిలోని రాజన్న పార్కు సమీపంలో మంచాల వీధి […]

Read More

రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించిన కడప జట్టు

రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించిన కడప జట్టు కడప క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి మొదటి జూనియర్‌ టెన్నిస్‌ క్రికెట్‌ పోటీల్లో కడప జట్టు అత్యుత్తమ ప్రతిభ చూపి రెండోస్థానం సాధించిందని రాష్ట్ర టెన్నిస్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శి ప్రతాప్‌ తెలిపారు. డిసెంబరు 31, జనవరి 2 తేదీలలో నెల్లూరు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీల్లో 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్న టెన్నిస్‌ పోటీల్లో కడప జిల్లా జట్టు మంచి ప్రతిభ కనబరిచి రన్నరప్‌గా నిలిచిందన్నారు. అలాగే జిల్లా […]

Read More

వైకుంఠ ప్రదక్షిణం.. పుష్కర స్నానం పరమపావనం…

వైకుంఠ ప్రదక్షిణం.. పుష్కర స్నానం పరమపావనం… పర్వదినాలు పరిసమాప్తం లక్షలాదిగా వైకుంఠ ద్వార ప్రదక్షిణ తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల దివ్యక్షేత్రం పరంగా అత్యంత విశేషమైన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు పరిసమాప్తమయ్యాయి. రెండు పర్వదినాల్లో భక్తకోటి ఆధ్యాత్మికానందంతో తరించింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఘడియల్లో శ్రీవారిని దర్శించి ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో ప్రవేశించి దివ్యానుభూతిని పొందింది. శుక్రవారం వేకువజామున వైకుంఠ ఏకాదశి ఘడియల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు రంగురంగుల విద్యుద్దీపాలతో, పరిమళాలు వెదజల్లుతున్న వర్ణరంజిత పుష్పాలతో […]

Read More

క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం

క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం జూ।।కళాశాలల క్రీడల ముగింపు వేడుక ఓవరాల్‌ ఛాంపియన్‌ ఎస్పీడబ్ల్యూ మంత్రి సతీమణి రేణుకారెడ్డి వెల్లడి పలమనేరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి సతీమణి రేణుకారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బుధవారం జిల్లా జూనియర్‌ కళాశాలల క్రీడాపోటీల బహుమతి ప్రదానోత్సవ సభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాతరోజుల్లో కంటే ఇప్పుడు క్రీడలకు మంచి ప్రోత్సాహం లభిస్తోందన్నారు. క్రీడలు జీవన విధానంలో మనకు […]

Read More

ప్రతి భక్తునికి దివ్యమైన దర్శనం

ప్రతి భక్తునికి దివ్యమైన దర్శనం కాణిపాకం, న్యూస్‌టుడే: ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తునికి దివ్యమైన దర్శనం కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్తూరు ఆర్డీవో కోదండరామిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆలయ పరిపాలన భవనంలో జిల్లా స్థాయి అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ…. ఉదయం 6 గంటల వరకు… సాయంత్రం 6 గంటల తర్వాత వీఐపీల […]

Read More

ఆవిష్కరణలకు ఎస్వీయూ కేంద్ర బిందువు

ఆవిష్కరణలకు ఎస్వీయూ కేంద్ర బిందువు పాలనాధికారి ప్రద్యుమ్న తిరుపతి(ఎస్వీ విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: ‘శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన దిశానిర్దేశంలో వర్సిటీ యంత్రాంగం  చరుగ్గా పనిచేస్తోంది’ అని జిలా పాలనాధికారి ప్రద్యుమ్న కితాబిచ్చారు. సోమవారం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి విచ్చేసిన ఆయన వీసీ ఆచార్య దామోదరంతో కలిసి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన పలువురు విభాగాధిపతులు, ఇంజినీరింగ్‌ విభాగాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాలనాధికారి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఎన్నో అభివృద్ధి […]

Read More

క్రీడలతో ఉజ్వల భవిత

క్రీడలతో ఉజ్వల భవిత డీఎస్పీ రామ్‌కుమార్‌   దక్షిణ ప్రాంత అంతర విశ్వవిద్యాలయాల టెన్నిస్‌ టోర్నీ ప్రారంభం తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: యువతకు క్రీడల ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చిత్తూరు సెష్పల్‌ బ్రాంచి డీఎస్పీ రామ్‌కుమార్‌ పేర్కొన్నారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో దక్షిణ ప్రాంత అంతర విశ్వవిద్యాయాల పురుషుల టెన్నిస్‌ టోర్నమెంట్‌ మంగళవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా డీఎస్పీ రామ్‌కుమార్‌, ఎస్వీయూ వీసీ ఆచార్య దామోదరం, రెక్టార్‌ భాస్కర్‌లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం క్రీడా […]

Read More

జంగమయ్య క్షేత్రం.. జాతర సంబరం

జంగమయ్య క్షేత్రం.. జాతర సంబరం అత్యంత వైభవంగా ఏడుగంగల జాతర శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: సమస్త లోకాలను సంరక్షించే.. కరుణాసముద్రిగా.. ఆర్తుల పాలిట అండగా ఉంటూ.. భక్తుల కొంగుబంగారమైన గంగమ్మ వేడుకలతో జంగమయ్య క్షేత్రం పులకించిపోయింది. ఏడుగంగల జాతర సంబరాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీకాళహస్తి పట్టణం సందడిగా మారింది. పట్టణంలోని ఏడు ప్రదేశాల్లో ఒక్కో చోట ఒక్కో పేరుతో.. ఒక్కో దివ్యమైన అలంకారంతో.. కొలువుదీరిన సప్తమాతృకల శక్తి స్వరూపిణిలను దర్శించుకునేందుకు జనం అశేషంగా తరలివచ్చారు. ఆయా ప్రాంతాల్లో అక్కడి […]

Read More

బృహత్తర అభివృద్ధి అనివార్యం

బృహత్తర అభివృద్ధి అనివార్యం నిర్వాసితులకు వీలైనంత ప్రయోజనం శ్రీకాళహస్తీశ్వరాలయం (శ్రీకాళహస్తి), న్యూస్‌టుడే: ముక్కంటి ఆలయం తరఫున చేపట్టదల్చిన బృహత్తర అభివృద్ధికి అందరి సహకారం అవసరమని జిల్లా సంయుక్త పాలనాధికారి గిరీషా అన్నారు. ఇక్కడి ఆలయ పరిపాలన భవనంలో గురువారం ఆయన ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, నిర్వాసితులతో సమావేశమయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి జేసీ మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే అందరి సహకారం అవసరమన్నారు. బాధితులకు వీలైనంతగా ప్రయోజనం కల్పించే విధంగా ప్రణాళికలు తయారు చేసినట్లు వివరించారు. పుణ్యక్షేత్రం […]

Read More

మరుగుదొడ్ల వినియోగంతో స్వచ్ఛ జిల్లా..

మరుగుదొడ్ల వినియోగంతో స్వచ్ఛ జిల్లా..   చిత్తూరు(జిల్లా సచివాలయం), న్యూస్‌టుడే : మరుగుదొడ్ల వినియోగంతో జిల్లాను స్వచ్ఛ చిత్తూరు మార్చాలని కలెక్టరు పీఎస్‌ ప్రద్యుమ్న పిలుపునిచ్చారు. జిల్లా సచివాలయంలో ప్రాంగణంలో అధునాతనంగా నిర్మించిన మరుగుదొడ్లను సోమవారం మధ్యాహ్నం మీకోసం కార్యక్రమానికి వచ్చిన మహిళలతో ఆయన ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రూ.20 లక్షల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో మరుగుదొడ్లను నిర్మించినట్లు చెప్పారు. స్త్రీ, పురుఫులతో […]

Read More