News

koil alwar thirumangalam

వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈనెల 9 నుంచి మూడు రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం ఐదు గంటలకు అమ్మవారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన పూజలు చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి 8.30 గంటల వరకు అమ్మవారి గర్భాలయం, శ్రీకృష్ణస్వామి, శ్రీసుందరరాజస్వామి ఆలయంలోని గోడలను సుగంధ పరిమళ ద్రవ్యాలతో శుద్ధి చేశారు. […]

Read More
srikalahasti Heavy industrial area, srikalahasti

‘సిరి’ ‘కాల’ హస్తి..!

‘సిరి’ ‘కాల’ హస్తి..! ఓ వైపు.. భారీ పారిశ్రామిక ప్రాంతం మరో వైపున..ఎలక్ట్రానిక్స్‌ హబ్‌ తూర్పు మండలాల్లో..ప్రగతి కూర్పు చిన్నపాటి పరిశ్రమ ఏర్పాటైతే పది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదే భారీ పరిశ్రమలు వస్తే..వందలాది మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధి దరిచేరే అవకాశముంటుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని తూర్పు మండలాలు ఎనలేని గుర్తింపు సంతరించుకున్నాయి. ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉండటం, రవాణా మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం, నీటి వనరులు అవసరమైన మేర […]

Read More

రూ.40 కోట్లతో కోర్టులకు కొత్త భవనాలు

రూ.40 కోట్లతో కోర్టులకు కొత్త భవనాలు చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే: చిత్తూరు న్యాయవాదుల కల నెరవేరింది. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలోనే నూతన కోర్టుల సముదాయ నిర్మాణానికి రాష్ట్ర హైకోర్టు రూ.40 కోట్లు మంజూరు చేసిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి దుర్గారావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో చిత్తూరు న్యాయవాదుల సంఘం వార్షికోత్సవ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ చిత్తూరు బార్‌ అసోసియేషన్‌కు గొప్ప చరిత్ర ఉందన్నారు. అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సీనియర్‌ న్యాయవాదులను సత్కరించడం, […]

Read More

అటవీశాఖ భరోసా.. వన్యప్రాణి కులాస!

అటవీశాఖ భరోసా.. వన్యప్రాణి కులాస! శేషాచలంలో కృత్రిమ నీటిగుంతల ఏర్పాటు వేసవి తాపం పెరిగిపోతోంది. పదిగంటలకే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. నీటి వనరులు, బోర్లు అడుగంటి పోయాయి. 30 నుంచి 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలనే చూసిన జనం.. ప్రస్తుతం 45 డిగ్రీల ఎండ తీవ్రతను ఎదుర్కోవలసి వస్తోంది. ఇది కేవలం జనానికేకాదు, అరణ్యాల్లో మనుగడ సాగిస్తున్న వన్యప్రాణులకూ తప్పడంలేదు. ఎండ తీవ్రతతో అడవిలో ఎండిపోతున్న నీటి చెలమలు, జలపాతాలు దర్శనమిస్తున్నాయి. గొంతు తడపుకునేందుకు వన్యప్రాణులు అరణ్యాన్ని […]

Read More

ఘనంగా భాష్యకారుల ఉత్సవం

ఘనంగా భాష్యకారుల ఉత్సవం తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో శ్రీభాష్యకారుల ఉత్సవాల్లో భాగంగా వెళ్లె సాత్తుపడి (ధవళ వస్త్రం) గురువారం ఘనంగా జరిగింది. ఈనెల 22 నుంచి ఉత్సవాలు ప్రారంభం కాగా.. వీటిలో 6వ, చివరి రోజు ఉత్సవాలు అత్యంత ప్రాధాన్యమైనవి. ఆరో రోజు ఉత్సవాన్ని ‘వెళ్లె సాత్తుపడి’గా వ్యవహరిస్తారు. భగవత్‌ రామానుజాచార్యులను తెల్లటి వస్త్రాలు, పూలదండలతో విశేషంగా అలకరించి ఆలయ తిరువీధుల్లో తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహించారు. పెద్దజీయంగార్‌, చిన్నజీయంగార్‌లు, ఏకాంగులు దివ్యప్రబంధ గోష్ఠిగానం చేశారు. శ్రీరామానుజాచార్యుల జన్మించిన […]

Read More

తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిద్దిదాం

తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిద్దిదాం ఈనాడు- తిరుపతి: తితిదే పాలకమండలి రెండేళ్ల పదవి కాలంలో తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దాం. రూ.132.41 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి ఉద్ఘాటించారు. స్థానిక పద్మావతీ అతిథిగృహంలో బుధవారం రెండేళ్ల పదవీకాలంపై విలేకరులతో మాట్లాడారు. రహదారుల మరమ్మతులు, ఎల్‌ఈడీ దీపాలు, పచ్చదనం తదితర అంశాల్లో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని చెప్పుకొచ్చారు. రేణిగుంట కూడలి నుంచి కాలూరు క్రాస్‌ వరకు 200 అడుగుల […]

Read More
akshaya truteeya, sirulu kurupinche sirulu

సిరులు కురిపించే ‘అక్షయ తృతీయ’

సిరులు కురిపించే ‘అక్షయ తృతీయ’ అక్షయ అంటే తరగనిది అని అర్థం. పురాణాల్లో అక్షయపాత్రను వినివుంటాం. ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి ఎన్నిమంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వరాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం వుంటే చాలు జీవితంలో ఏ లోటు వుండదు. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో తదియ నాడు వచ్చే పర్వదినాన్ని పవిత్రమైనది భావిస్తారు. […]

Read More

28న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష

28న పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పాలిసెట్‌-2017 ప్రవేశ పరీక్ష ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు పాలిసెట్‌ జిల్లా సమన్వయకర్త కె.సుబ్రహ్మణ్యం తెలిపారు. మంగళవారం తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని తిరుపతి, మదనపల్లి, కుప్పం, మదనపల్లిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా […]

Read More

అందుబాటులో శ్రీవారి బంగారు, వెండి డాలర్లు

అందుబాటులో శ్రీవారి బంగారు, వెండి డాలర్లు తితిదే ఈవో సాంబశివరావు తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: ఈనెల 29న అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లు కొరత లేకుండా తగినన్ని అందుబాటులో ఉంచుకోవాలని తితిదే ఈవో సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో వారపు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండ నుంచి భక్తులకు ఉపశమనం కల్పించేందుకు స్థానికాలయాల్లో చలువపందిళ్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు […]

Read More
development progress, development city

ప్రతి పంచాయతీని అభివృద్ధి చేద్దాం

ప్రతి పంచాయతీని అభివృద్ధి చేద్దాం జిల్లా పాలనాధికారి ప్రద్యుమ్న చిత్తూరు(జిల్లాపరిషత్‌), న్యూస్‌టుడే: గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ కీలకమైంది, జిల్లాలోని ప్రతి పంచాయతీని అన్ని పనులతో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలపాలి, అందరం కలిసి పనిచేద్దాం అని జిల్లా పాలనాధికారి ప్రద్యుమ్న అధికారులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.              జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం పురస్కరించుకుని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గీర్వాణి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. జిల్లా పాలనాధికారి […]

Read More